రాష్ట్ర మహాసభను 7వ తేదీన శ్రీకాకుళంలో జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ వలి పిలుపునిచ్చారు. గురువారం ఏఐవైఎఫ్ కార్యకర్తలు గుంటూరులో మాట్లాడుతూ రాష్ట్రంలో యువత సమస్యలపై నిత్యం పోరాడుతున్న ఏఐవైఎఫ్ కార్యకర్తలు కదిలి రావాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా. యువతను మోసం చేస్తుందన్నారు. త్వరలో కార్యాచరణ రూపొందించి ఉద్యమానికి శ్రీకారం చూడతామన్నారు.