గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో శనివారం గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. 190 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా వారిలో 106 మంది అర్హత సాధించగా, 84 మంది అనర్హత సాధించడం జరిగినది. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు ఏ. సుప్రజా (క్రైమ్స్), ఏ. హనుమంతు (ఏఆర్) తదితర అధికారులు పాల్గొన్నారు.