గుంటూరు నగర మేయర్ గా కోవెలమూడి.?

85చూసినవారు
గుంటూరు నగర మేయర్ గా కోవెలమూడి.?
37వ డివిజన్ కార్పోరేటర్, టీడీపీ సీనియర్ నాయకుడు కోవెలమూడి నానీకి గుంటూరు మేయర్ పీఠం వరించింది. మంత్రి లోకేశ్ ఆదేశాలకు అనుగుణంగా శనివారం పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 18తో ప్రస్తుతం ఉన్న మేయర్ మనోహర్ నాయుడు పదవీ కాలం నాలుగేళ్లు పూర్తవుతోంది. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కోవెలమూడి విశేషమైన కృషి చేశారు. అదిష్టానం నిర్ణయంతో అభిమానులు సంబరాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్