ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చియార్డు పరిసర ప్రాంత ప్రజలు దగ్గు, తుమ్ములతో అల్లాడిపోతున్నారు. సీజన్ కావడంతో మిర్చి టిక్కీలు అధికంగా యార్డుకు వస్తున్నాయి. యార్డు చుట్టుపక్కల పందిళ్ళు వేసి, తొడిమలు తీసిన మిర్చిని సాయంత్రం కొందరు కాలుస్తున్నారు. కోరు వస్తుండటంతో ప్రజలు ఇళ్ళల్లో ఉండటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గురువారం ప్రజలు కోరుతున్నారు.