గుంటూరులో వైభవంగా రథసప్తమి వేడుకలు

54చూసినవారు
గుంటూరు నగరంలో రధసప్తమి పర్వదిన వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయాన్నే సూర్య భగవానుడుకి పొంగలి నైవేద్యంగా పెట్టారు. అదేవిధంగా నెలలో తొలి మంగళవారంని పురస్కరించుకుని అష్టదళ పాద పద్మారాధన నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శనం గావించారు.

సంబంధిత పోస్ట్