గుంటూరులో తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్ పాదర్తి గాంధీని అరెస్టు చేసినట్లు గుంటూరు వెస్ట్ డీఎస్పీ జయరాం ప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 4 కేసుల్లో కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా గాంధీ తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. పట్టాభిపురం సీఐ వీరేంద్రబాబు సిబ్బందితో కలిసి గాంధీని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారన్నారు.