దాచేపల్లి: పట్టపగలే దొంగతనం.. పోలీసుల విచారణ

55చూసినవారు
దాచేపల్లి: పట్టపగలే దొంగతనం.. పోలీసుల విచారణ
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో గురువారం మధ్యాహ్నం పట్ట పగలే చోరీ జరిగింది. గ్రామంలో చొరబడిన దొంగలు ఒక ఇంటి నుంచి రెండు లక్షల నగదు, పది సవర్ణ బంగారం చోరీ చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్