గురజాల నియోజకవర్గంలోని అధికారులతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడుగురాళ్ల ఆర్ అండ్ బి బంగ్లాలో ఆయన వారితో మాట్లాడుతూ నియోజకవర్గంలో వరద ప్రవాహానికి గురైన ప్రాంతాల ప్రజలకు అన్ని సౌకర్యాలు అందజేయాలంటూ ఆయన అధికారులకు సూచించారు. అలానే నియోజకవర్గంలో ఎంతవరకు పంట నష్టం జరిగిందో అంచనా వేయాలని తెలియజేశారు.