
మాచవరం: సిమెంట్ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
మాచవరం మండలం మల్లవోలు గ్రామంలో ఉగ్ర నరసింహ స్వామి దేవస్థానం వరకు నిర్మాణం చేపట్టబోతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం గురజాల ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవస్థానం వరకు రోడ్డు అద్వానంగా ఉందని ప్రత్యేక నిధులతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.