మాచర్ల: పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి
భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలోని ప్రతి వార్డులో పారిశుద్ధ్యానికి మొదటి ప్రాధాన్యమిస్తూ అన్ని ప్రాంతాలలో నీటి నిల్వలను తొలగించి కాల్వలు శుభ్రపరచనున్నట్లు మాచర్ల మున్సిపల్ కమిషనర్ డి. వేణుబాబు తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా లోతట్టు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశామని చెప్పారు.