ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు అదనపు ఎస్పీ రవికుమార్ తెలిపారు. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ కేసులో గుంటూరుకు చెందిన సతీశ్, వినోద్, గౌస్య లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 17 బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మంగళగిరితో పాటు విజయవాడ చుట్టు ప్రక్కల పలు ప్రాంతాల్లో ఈ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.