మంగళగిరి గణపతి నగర్లోని యూపీహెచ్సిలో 1 నుంచి 7వ తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత హెల్త్ సెంటర్ లోని మీటింగ్ హాల్లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష గర్భవతులు, బాలింతలకు తల్లిపాల విశిష్టత పై అవగాహన కల్పించారు. అనంతరం తల్లిపాల విశిష్టతను తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈమేరకు డాక్టర్ అనూష మాట్లాడుతూ బ్రెస్ట్ ఫీడింగ్ తో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు దూరమవుతాయని అన్నారు.