మంగళగిరి ఏపీ పిటిడి ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్య దర్శి వి. నాగేశ్వరరావును యాజమాన్యం అన్యాయంగా సస్పెండ్ చేసిందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట దీక్షలు చేపట్టారు. కంట్రోలర్ డ్యూటీ చార్ట్ లో అవకతవకలను ప్రశ్నించినందుకు సస్పెన్షన్ చేయడం దారుణమని అన్నారు.