తాడేపల్లిలో కృష్ణానదిలో దూకి వివాహిత గల్లంతు

66చూసినవారు
తాడేపల్లిలో కృష్ణానదిలో దూకి వివాహిత గల్లంతు
కృష్ణానదిలో దూకి మహిళ గల్లంతైన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి సీతానగరం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జక్కంపూడి వైయస్సార్ కాలనీకి చెందిన రమ (36) అనే వివాహిత కుటుంబకలహాల నేపథ్యంలో శుక్రవారం ప్రకాశం బ్యారేజీ పైనుండి కృష్ణానదిలో దూకినట్లు తెలిపారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మహిళ ఆచూకీ కనిపించలేదని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్