మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్, గ్యాస్ పైప్లాన్ చేపట్టనున్నారు. ఈ పనులపై మంత్రి నారా లోకేశ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఎంటీఎంసీ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.