మంగళగిరి: మెరుగైన చికిత్సతో పాటు మనోధైర్యం అవసరం: ఎస్పీ సతీష్

మెరుగైన చికిత్స, మనోధైర్యం అనేవి క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కొనే ఆయుధాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజశేఖర బాబు ఐపీఎస్ తో కలిసి గుంటూరు ఎస్పీ పాల్గొన్నారు. క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు.