మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు నగర పరిధిలోని ఆవుల యజమానులతో సమావేశం నిర్వహించి చెప్పిన ఎటువంటి స్పందన లేనందున ప్రజా శ్రేయస్సు దృష్ట్యా రోడ్లపై తిరుగుతున్న ఆవులను గోశాలకు తరలించారు. గురువారం నగరంలో తిరుగుతున్న 14 ఆవులను మార్కండేయ కాలనీలోని గోశాలకు తరలించినట్లు కమిషనర్ అలీమ్ బాషా తెలిపారు. మిగిలిన ఆవులను దఫాల వారిగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.