రాష్ట్రం అభివృద్ధికి అవసరమైన ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థులందరు నాకన్నా పెద్ద స్థాయికి చేరాలన్నదే నా ఆకాంక్షని అందుకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రధాని మోడీ, చంద్రబాబు నేతృత్వంలో భారత్లో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయన్నారు.