మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి మాత్రపు జెస్సీ రాజ్ రాష్ట్రపతి చేతులమీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్-2025 అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జెస్సీరాజ్ను మంత్రి అభినందించారు. భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.