మంగళగిరి: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

60చూసినవారు
యర్రబాలెం పరిధిలో ఈనెల 1వ తేదీన పాఠశాల ముగించుకుని ఇంటికి వెళ్తున్న 8వ తరగతి బాలికను అడ్డగించిన ఘటనలో వ్యక్తిని అరెస్టు చేశామని మంగళగిరి రూరల్ ఎస్ఐ సీహెచ్ వెంకట్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎయిమ్స్ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో అసిస్టెంట్ గా పనిచేస్తున్న రుద్రు వెంకటేశ్ (25) బాలికను అడ్డగించి అనుచితంగా ప్రవర్తించాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్