మంగళగిరిలో డ్రోన్లతో సరికొత్త సేవలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. యూపీహెచ్ సీ ఇందిరా నగర్ నుంచి ఎయిమ్స్ గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం పిఏపి స్మెర్ నమూనాలను డ్రోన్ సహాయంతో 2 నిమిషాల్లో పంపించారు. వైద్య రంగంలో ఏపీ మరో మైలురాయిని అధిగమించిందని ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. డ్రోన్ సేవల పైలట్ ప్రాజెక్ట్ ను ఆయన ప్రారంభించారు. ఎయిమ్స్ సిబ్బందిని, అధికారులను అభినందించారు.