దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది జనాభా ఉన్న చేనేతకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ. 200 కోట్ల కేటాయించటం దుర్మార్గమని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగేశ్వరరావు అన్నారు. మంగళగిరి వేములపల్లి శ్రీకృష్ణ భవన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ 200 కోట్లు కేటాయించడం సరికాదని కనీసం రూ. 10వేల కోట్లు కేటాయించాలన్నారు. జిల్లా అధ్యక్షులు జీ. వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.