సంక్రాంతి పండుగ సందర్భంగా డీవైఎఫ్ఎ, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహించాలని మాజీ డీవైఎఫ్ఎఐ నాయకులు వీసం జవహర్ లాల్ అన్నారు. మంగళగిరి డీవైఎఫ్ఎ కార్యాలయంలో గురువారం ఎస్ వెంకటేశ్ అధ్యక్షతన డీవైఎఫ్ఎ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా, సమాజ అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.