మంగళగిరి పట్టణంలోని పలు ప్రాంతాలలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈఈ సురేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8. 30 నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు గండాలయ్య పేట, కొత్తపేట, ఆర్& బీ బంగ్లా రోడ్, హాస్పిటల్ రోడ్, మెయిన్ బజార్ ఎయిమ్స్ గేట్, ఎకో పార్క్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ లైన్ మరమ్మతుల నిమిత్తం సరఫరా ఉండదన్నారు.