మంగళగిరిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

52చూసినవారు
మంగళగిరిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
మంగళగిరి పరిధి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు విజే కాలేజీ ఎదుట బైపాస్ రోడ్డుపై మంగళగిరి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి మరో ద్విచక్రవాహనం ఢీ కొట్టగా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్