ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే జగన్ ఇంటి ముందు బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు ఉన్న రోడ్డు సైడ్ భాగంలో ఎండిపోయి ఉన్న గార్డెన్ గుర్తుతెలియని ఆకతాయిలు సిగరెటు తాగి అక్కడ వేయడంతో మొక్కలకు నిప్పు అంటుకుని ఉండవచ్చని స్థానికులు అన్నారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, ఫైర్ సిబ్బంది వెంటనే మంటలు ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.