గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులకు నిధులు కేటాయించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు నందించాలని మంత్రి నారా లోకేశ్ ను ఎమ్మెల్యే గళ్ళ మాధవి కోరారు. మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబందించిన పలు అభివృద్ధి పనులను వినతి పత్రం రూపంలో ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళారు. లోకేష్ సానుకూలంగా స్పందించి, నియోజకవర్గ అభివృద్ధికి తానుఅండగా ఉంటానని హామీనిచ్చారు.