తాడేపల్లిలో ఉల్లిపాయలను దొంగలించిన దొంగలు

82చూసినవారు
తాడేపల్లిలో ఉల్లిపాయలను దొంగలించిన దొంగలు
తాడేపల్లి మండలం పెనుమాకలో కృష్ణారెడ్డి అనే రైతు పండించిన ఉల్లిపాయల పంటను దొంగలు దోచుకెళ్ళారని తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ. సోమవారం రాత్రి వరకు ఉల్లిపాయలు ఆరబెట్టి ఉంచామని అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు 50కేజీల ఉల్లిపాయ సంచులు, మొత్తం 19 టిక్కీలు ఆటోలో దోచుకుపోయారని వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతు కృష్ణారెడ్డి వేడుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్