తాడేపల్లి పరిధి సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రావణమాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని ధనలక్ష్మి, సంతాన లక్ష్మి అమ్మవార్లకు తిరుమంజన సేవ, వరలక్ష్మీవ్రతం సందర్భంగా శ్రీ లక్ష్మి నారాయణ పెరుమాళ్ళకు అభిషేకం నిర్వహించారు. అనంతరం 3రోజుల పాటు జరిగే భూ వరాహ జయంతి మహోత్సవాలు తొలిరోజు భూ సమస్యల పరిష్కారం, సర్వసంపదల కోసం శ్రీసూక్తహవనం, భూ వరాహ హెూమం నిర్వహించారు.