రుణాలు అవసరం ఉన్న రైతులను గుర్తించి వారికి రుణాలు అందించే విధంగా బ్యాంకర్లు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి. లాట్కర్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులతో డిసెంబరు-2023 నుంచి మార్చి-2024 త్రైమాసికానికి సంబందించి డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీలతో సమీక్ష నిర్వహించారు. రుణాల మంజూరులో బ్యాంకర్లు సహకరించాలన్నారు.