నరసరావుపేటలోని చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా తమకుఫిర్యాదు చేయవచ్చని వన్టౌన్ సీఐ విజయ్ చరణ్ అన్నారు. పోలీస్ స్టేషన్లో మంగళవారం అయన మాట్లాడుతూ రూ. 2కోట్ల 80లక్షలు కట్టించుకొని చిట్ ఫండ్ యజమాని ఇప్పుడు కనిపించకుండా పోవడంతో సుబ్బారెడ్డి అనే బాధితుని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసుకు సంబంధించి ఎవరైనా నష్టపోయి ఉంటే వివరాలను తెలియజేయాలని సీఐ కోరారు.