

పెళ్లిలో గిఫ్ట్‌గా బ్లూ డ్రమ్.. షాక్ అయిన కొత్త జంట (వీడియో)
ఇటీవల యూపీలో సౌరభ్ అనే వ్యక్తిని భార్య హత్య చేసి బ్లూ డ్రమ్‌లో పాతిపెట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో బ్లూ డ్రమ్ అంటేనే చాలా మంది భయపడుతున్నారు. యూపీలో వాటి అమ్మకాలు కూడా తగ్గినట్లు ఓ వార్తపత్రిక వెల్లడించింది. అయితే తాజాగా యూపీలోని హమీర్ పూర్లో ఓ పెళ్లి జంటకు స్నేహితులు బ్లూ కలర్ డ్రమ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనిని చూసి పెళ్లికొడుకు షాక్ అయ్యాడు. వధువు మాత్రం నవ్వుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.