భీష్మ ఏకాదశి సందర్భగా పర్చూరు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, సంపూర్ణ భగవద్గీత పారాయణం ఘనంగా జరిగాయి. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పర్చూరు వైస్ ఎంపీపీ కోటా ప్రసన్న శ్రీనివాసరావు పాల్గొన్నారు.