కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామానికి చెందిన బెల్లంకొండ యామిని అనే మహిళ అక్రమంగా మద్యం సీసాలు అమ్ముతుందని సమాచారంతో శనివారం ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆమె వద్ద నుంచి 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. అక్రమ మద్యం అమ్మకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.