ఇంకొల్లు సర్కిల్ పరిధిలోని కారంచేడు, ఇంకొల్లు, చిన్నగంజాం మండలాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రమణయ్య హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజూ మండలాల్లో పోలీసు గస్తీ ఉంటుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారు కనిపిస్తే వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేశారు.