సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ముగించుకొని ఇంటికి వెళుతున్న బాలు అనే విద్యార్థి డివైడర్ దటుతున్న క్రమంలో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని బాలుడిని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.