పశ్చిమబెంగాల్ లోని ఆర్ జి కార్ వైద్య కళాశాలలో రెసిడెంట్ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా ఐఎంఏ పిలుపుమేరకు రేపు శనివారం పొన్నూరు పట్టణంలో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సజ్జ రవీంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని, ఇటువంటి ఘటనలపై ప్రత్యేక చట్టాలు తేవాలని 24 గంటలు వైద్యశాలలు బంద్ ప్రకటించామన్నారు.