వైఎస్ఆర్సిపి కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

84చూసినవారు
వైఎస్ఆర్సిపి కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని వైయస్సార్ పార్టీ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితమే స్వాతంత్ర దినోత్సవం అని వారు త్యాగాలు మరువలేని వని పేర్కొన్నారు. పలువురు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్