గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం లోని నిడుబ్రోలు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పెద్ద చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. సమాచారం మేరకు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును యుద్ధ ప్రాతిపదికన సిబ్బందితో తొలగించి ప్రజలకు, వాహనదారులకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.