పొన్నూరు: డెంగ్యూ వ్యాధిపై అవగాహన ర్యాలీ

61చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 23వ వార్డు అంబేద్కర్ కాలనీ ప్రాథమిక వైద్యశాల దగ్గర శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నివారణ చర్యలపై ప్రతిజ్ఞ చేశారు. దోమల వలన డెంగ్యూ నివారణ చర్యలను కార్యక్రమంలో డాక్టర్ హరిణి వివరించారు. ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మలేరియా ఇన్చార్జి హరిబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్