పొన్నూరు మండలంలోని వెలలూరు, బ్రాహ్మణకోడూరు గ్రామాలలో బుధవారం తమిళనాడు వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించారు. మట్టి నమూనాల సేకరణ, రాయితీపై విత్తనాల పంపిణీ, పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీ, పంట నమోదు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఆర్ఎంజి, జె ఎల్ జి గ్రూపుల నిర్వహణ, రైతు సేవ కేంద్రం సిబ్బంది ఇచ్చే సలహాలు సూచనలు క్షేత్ర సందర్శన సమయంలో రైతులతో జరిగే చర్చల గురించి అడిగి తెలుసుకున్నారు.