కృష్ణ - గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మంగళవారం పొన్నూరు తెదేపా కార్యాలయములో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.