పొన్నూరు పురపాలక సంఘంలో ఈనెల 17 శనివారం స్వర్ణ ఆంధ్ర_ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా" బీట్ ద హార్ట్"ఎండ తీవ్రతలను ఎదుర్కోవటం అనే ధీమ్ తో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పట్టణం పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి మానవతా సేవా సంస్థ, ఆర్యవైశ్య సంఘం , ఇతర అన్ని వర్తక సంఘాలు హాజరవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు.