పొన్నూరు పట్టణo వెంకట సీతారామ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సభ జరిగింది. గుంటూరు రీజియన్ అధ్యక్షుడు రావిపాటి ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు సుప్రీంకోర్టు ప్రకటించిన రూ. 7500 భృతి ఇవ్వాలన్నారు. ప్రభుత్వాలు మారిన సమస్యలు పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం వలన విశ్రాంత ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు.