పొన్నూరు: కౌలు రైతులకు గ్రూపు రుణాల సౌకర్యం ఏవో

54చూసినవారు
పొన్నూరు: కౌలు రైతులకు గ్రూపు రుణాల సౌకర్యం ఏవో
పొన్నూరు మండల పరిధిలో ఉన్న కౌలు రైతులకు గ్రూప్ రుణాలు ఇచ్చేందుకు వివిధ బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని పొన్నూరు మండల వ్యవసాయ అధికారి డేగల వెంకట్రామయ్య పేర్కొన్నారు. మంగళవారం ములుకుదురు, మాచవరం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఐదుగురు కౌలు రైతులు గ్రూపుగా ఏర్పడితే పంట రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్థానిక రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్