రేపు పొన్నూరు మండలంలో విద్యుత్ నిలిపివేత

65చూసినవారు
రేపు పొన్నూరు మండలంలో విద్యుత్ నిలిపివేత
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ, మండల పరిధిలో రేపు శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పట్టణ, రూరల్ ఏఈ లు వెంకటనారాయణ, వెంకయ్య శుక్రవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్తు లైన్లు మరమ్మత్తులు నేపథ్యంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. పొన్నూరు మండలంలోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్