ఎస్సీల వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం. చిల్కా విజయ్.

68చూసినవారు
ఎస్సీల వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం. చిల్కా విజయ్.
ఎస్సీల వర్గీకరణ తెదేపా అధినేత సీఎం చంద్రబాబు తోనే సాధ్యమని తెదేపా ఎస్సీ నాయకుడు చిల్కా విజయ్ పేర్కొన్నారు. గురువారం ఆయన పొన్నూరు పట్టణంలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని చిల్కా విజయ్ హర్షం వ్యక్తం చేశారు. మాదిగ దండోరా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఆయన జోహార్లు అర్పించి ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్