గుంటూరు జి డి సి సి బ్యాంకులో రైతులు పేరిట నకిలీ పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్స్ సృష్టించి రైతుల పేరిట లక్షలాది రూపాయలు పక్కదారి పట్టించారని వీటిపై విచారణ చేయాలని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శుక్రవారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని వెలికి తీసి ప్రభుత్వ ఆదాయాన్ని రాబట్టాలన పేర్కొన్నారు. నకిలీ రుణాలు పొందిన వారి ఆస్తులు జప్తు చేయాలని కోరారు.