గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం, గాలులకు ఓల్డ్ మద్రాస్ రోడ్డు సినిమా హాల్ వద్ద తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు కట్టిన హోర్డింగ్ ఆర్చి విరిగిపడి రాకపోకలకు ఆటంకం కలిగింది. ప్రధాన రహదారి కావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి హోర్డింగ్ ను తొలగించాలని వాహన చోదకులు కోరారు.