ప్రతిపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

79చూసినవారు
ప్రతిపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
గుంటూరు జిల్లాపెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం గ్రామం పరిధిలో మహాదేవ్ కోల్డ్ స్టోరేజి వద్ద సోమవారం ద్విచక్ర వాహనంపై వస్తున్న అడుసుమల్లి గ్రామానికి చెందిన ఓట్ల నాగేశ్వరరావు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక స్పందించి 108 లో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెదనందిపాడు ఎస్సై మధు పవన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్